Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేశ్ నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం సాధించినప్పటికీ, తనకు అనుకున్నంత స్థాయిలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని స్వయంగా ఐశ్వర్య రాజేశ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దొరికిన అవకాశాల్లోనే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటీవల ఆమె నటించిన ‘ఓ సుకుమారి’ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఓవైపు ఈ ఫ్లాప్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకునే లోపే ఐశ్వర్య రాజేశ్ చేతికి వచ్చిన ఒక క్రేజీ ప్రాజెక్టు చేజారినట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో దర్శకుడు హసిత్ గోలి ఒక ఆసక్తికరమైన మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డేతో పాటు ఐశ్వర్య రాజేశ్‌ను హీరోయిన్లుగా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఐశ్వర్య రాజేశ్ స్థానంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ హఠాత్ మార్పునకు గల అసలు కారణాలు ఏమిటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే సంక్రాంతి బరిలో సినిమాను నిలబెట్టాలని నిర్మాత దిల్ రాజు పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ప్రస్తుతం బడ్జెట్ అదుపులో ఉంచేందుకు కాస్ట్ కటింగ్ ఫార్ములా ఉపయోగిస్తున్న దిల్ రాజు, తక్కువ పారితోషికానికి అంగీకరించే భామలనే ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయిస్తారనేది ఫిల్మ్‌నగర్ టాక్. ఒకటి రెండు రోజుల్లో హీరోయిన్ల ఎంపికపై మేకర్స్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!