Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naagin: భారీ అంచనాలతో ప్రకటించిన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం సినిమా ఇండస్ట్రీలలో కొత్త విషయం కాదు. గ్రాండ్ అనౌన్స్మెంట్ తర్వాత సంవత్సరాలు గడిచినా సెట్స్‌పైకి రాని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జాబితాలో చేరిపోయిందని అందరూ భావించిన శ్రద్ధా కపూర్ ‘నాగిన్’ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఆరేళ్ల క్రితం ప్రకటించిన ఈ బాలీవుడ్ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోందని నిర్మాత నిఖిల్ ద్వివేది వెల్లడించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 2019లో ఈ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు శ్రద్ధా కపూర్ ఇచ్ఛాధారి నాగిన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త హల్చల్ చేసింది. జానపద కథలను ఈ కాలానికి తగ్గట్టు తెరకెక్కించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పటికీ, వివిధ కారణాలతో షూటింగ్ మొదలుకాలేదు. కాలం గడుస్తుండటంతో సినిమా పూర్తిగా రద్దైందనే ప్రచారం కూడా బలంగా వినిపించింది. అయితే తాజా పరిణామాలతో ఆ వార్తలకు నిర్మాత స్వయంగా చెక్ పెట్టారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ద్వివేది మాట్లాడుతూ ‘నాగిన్’ ప్రాజెక్ట్ ఎక్కడా ఆగిపోలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాను తప్పకుండా తెరకెక్కిస్తామని తాను గతంలో కూడా చాలాసార్లు చెప్పానని, ఇప్పుడు ఆ దిశగా కీలక ముందడుగు పడిందని తెలిపారు. స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. దీంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ మళ్లీ గాడిలో పడిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి గతంలోనే శ్రద్ధా కపూర్ కూడా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి శ్రీదేవి నటించిన ‘నాగిన్’, ‘నిగాహెన్’ సినిమాలను చూసి పెరిగానని, అలాంటి జానపద పాత్రను ఒకరోజు తాను కూడా చేయాలనే కోరిక ఉండేదని చెప్పారు. అందుకే ఇచ్ఛాధారి నాగిన్ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని, ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అప్పట్లో వెల్లడించారు. మొత్తానికి, ఆరేళ్లుగా కేవలం ప్రకటనకే పరిమితమైందని అనుకున్న ‘నాగిన్’ ఇప్పుడు మళ్లీ జీవం పొందినట్లే కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్ ఇచ్ఛాధారి నాగిన్‌గా ఎలా అలరిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ కు సంబంధించి ఆఫీషియల్ డేట్ తో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇదిలా ఉంటే, బాలీవుడ్లో ప్రస్తుతం సర్పాల నేపథ్యంతో మరో సినిమా కూడా రూపొందుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘నాగ్జిల్లా’ తెరకెక్కుతోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోలికలు వస్తున్నాయి. అయితే ‘నాగిన్’ పూర్తిగా భిన్నమైన కథతో రూపొందుతుందని, రెండు చిత్రాల మధ్య ఎలాంటి పోలిక ఉండదని నిర్మాత నిఖిల్ ద్వివేది స్పష్టం చేశారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే, ‘స్త్రీ 2’ ఘనవిజయం తర్వాత ఆమె కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాగిన్’ కంటే ముందుగా ఆమె నటించిన ‘ఈత’ మూవీప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి భావు మాంగ్ నారాయణగావ్కర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఆ సినిమా తర్వాత ‘నాగిన్’ షూటింగ్ పై పూర్తి దృష్టి పెట్టే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!