ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్- థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం రండి. ట్రైలర్ డబుల్ ఇస్మార్ట్ స్టొరీ లైన్ లోని ఒక గ్రిప్పింగ్ గ్లింప్స్ ని అందిస్తుంది. ఎక్సయిటింగ్, హై స్టేక్స్ తో కూడిన ప్లాట్‌ను రివిల్ చేస్తుంది. బిగ్ బుల్ సంజయ్ దత్ అమరత్వం కోసం ఓ సెన్సేషనల్ ఎక్స్పరిమెంట్ చేస్తాడు. డబుల్ ఇస్మార్ట్ బాడీలోకి తన బ్రెయిన్ ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అతని ప్లాన్. ఇది రెండు బిగ్ డైనమోల మధ్య ఇంటెన్స్ వార్ కి స్టేజ్ ని సెట్ చేస్తోంది.
Also Read: Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?
ట్రైలర్ అన్ని కమర్షియల్ హంగులతో ఆదరగొట్టింది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్ మాస్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్ చాలా స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా వుంది. శివలింగం వద్ద క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో అద్భుతంగా కనిపించాడు. తన పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో డబుల్ ఎనర్జీని తెచ్చాడు. సంజయ్ దత్ బిగ్ బుల్‌గా టెర్రిఫిక్ గా ఉన్నాడు. కావ్య థాపర్ సూపర్-హాట్‌గా కనిపించింది. రామ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది.