ప్రముఖ కోలీవుడ్ నటుడు.. పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా హీరో పవన్ కల్యాణ్ కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించింది షిహాన్. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాతే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.
Also Read: Manchu Vishnu : పూర్తిగా శివ భక్తుడిగా మారాను
షిహాన్ హుస్సేనీ ఒక భారతీయ కరాటే నిపుణుడు, నటుడు. తమిళనాడులోని ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్ రంగాలలో ప్రసిద్ధి చెందారు. ఇష్షిన్‌ర్యూ కరాటేను భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా పేరు పొందారు. అతను తమిళ్ సినిమాల్లో కూడా నటించారు. ‘పున్నగై మన్నన్’ (1986), ‘వేలైక్కారన్’ (1987) వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల, షిహాన్ హుస్సేనీ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు 2025 మార్చి 20న ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన శరీరాన్ని వైద్య పరిశోధన, శరీర శాస్త్ర అధ్యయనం కోసం దానం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన సామాజిక సేవా దృక్పథాన్ని,మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది.