టాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్‌లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ పై దృష్టి పెట్టారు. పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని మోహన్ బాబు స్థాపించిన ‘24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ ద్వారా నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రం కోసం అతను హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల చేయబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీం పాల్గొంది. ఇందులో భాగంగా విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ లో అతను ఎంతగా లీనం అయ్యాడో తెలిపారు.
‘నేను మామూలుగా ఆంజనేయ స్వామి భక్తుడిని. కానీ ఎప్పుడైతే ‘కన్నప్ప’ సినిమా ప్రయాణం ప్రారంభం అయ్యిందో శివ భక్తుడిగా మారిపోయాను. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రభాస్ పాత్ర ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అనేలా ఉంటుంది. ఇందులో అందరు పెద్ద పెద్ద నటినటులు ఉన్నారు . ఈ ప్రయాణంలో నేను వారి నుండి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ‘కన్నప్ప’ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా మీ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన తర్వాత ఎంతో తృప్తిగా ఇంటికి తిరిగి వెళతారు’ అని అన్నారు.