పవర్ స్టార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో ఒక షిప్పు పరిశీలనకు వెళ్లి అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని తెలిసి వెంటనే దాన్ని ‘సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. సినీ పక్కీలో ఉన్న ఆ సీన్ చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన నాయకుడు డ్యూటీ చేస్తే ఇలానే ఉంటుంది ఏమో అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేశారు.
Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు నాగబాబు కీలక ట్వీట్
ఇక ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఎవరో ఒకరు ఈ సీజ్ ది షిప్ అనే దాన్ని సినిమాకి టైటిల్ గా కూడా వాడుకుంటారేమో అన్నట్టుగా సోషల్ మీడియాలో చలోక్తులు పేలాయి. ఆ చలోక్తులు నిజమై ఇప్పుడు ఆ పదంతోనే ఒక సినిమాని టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ఈ మేరకు ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేయిచింది. పవన్ సీరియస్ గా చెప్పిన ఆ డైలాగ్ ఇప్పుడు ఏకంగా సినిమాకి టైటిల్ గా మారడం ఆశ్చర్య పరిచే విషయమే.