సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి ముందు నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం… అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను.. అంటూ ఆయన సోషల్ మీడియా వేదిక రాసుకొచ్చారు.
Eknath Shinde: డిప్యూటీ సీఎంపై తేల్చని షిండే.. అజిత్ పవార్‌పై చురకలు..
నిజానికి పుష్ప సినిమా నెగిటివిటీ వెనుక మెగా ఫాన్స్ ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు ఎన్నికల ముందు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి నివాసానికి వెళ్లి ఆయనకు మద్దతు పలికిన అంశం తర్వాత మెగా అల్లు కాంపౌండ్స్ మధ్య దూరం మరింత పెరిగింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని…
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 4, 2024