థియేటర్లు తెరుచుకోవడంలో ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నా… స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టేశారు. జూలై నెలలోనే థియేటర్లలో తమ చిత్రం విడుదలవుతుందని ‘తిమ్మరుసు’ నిర్మాతలు చెప్పగా, తాజాగా ఈ నెల 23న ‘నరసింహపురం’ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ఫణిరాజ్, నందకిశోర్, శ్రీరాజ్ తెలిపారు. పలు సీరియల్స్, సినిమాలలో నటించి, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న నందకిశోర్ ‘నరసింహపురం’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సిరి హనుమంతు హీరోయిన్ గా, ఉష హీరో చెల్లెలుగా నటించిన ఈ మూవీని శ్రీరాజ్ బళ్లా డైరెక్ట్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశామని, థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేయాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు ఆంధ్రాలోనూ థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
Read Also : బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య