బాలీవుడ్ మూవీ ప్రారంభించిన నాగ చైతన్య

సమంతా అక్కినేని వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, సామ్ భర్త నాగ చైతన్య కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “లాల్ సింగ్ చద్దా”తో నాగ చైతన్య హిందీ తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగ చైతన్య సెట్స్ లో చేరాడు. లడఖ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ జరుపుకుంటోంది.

Read Also : బెస్ట్ మేకప్ మ్యాన్ అతనే… : మహేష్ బాబు

ఇందులో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా, అమీర్ సన్నిహితుడిగా కన్పించబోతున్నాడట. ఆర్మీ ఆఫీసర్ పాత్ర కోసం చైతన్య గట్టిగానే కసరత్తులు చేశారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం భారీగా డేట్స్ కేటాయించాడట చై. దాదాపు 20 రోజుల షూటింగ్ లో పాల్గొననున్నాడట. ఈ పాత్ర కోసం చైతన్యకు మంచి పారితోషికం కూడా ఆఫర్ చేశారట మేకర్స్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో కరీనా కపూర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. “లాల్ సింగ్ చద్దా” హాలీవుడ్ హిట్ “ఫారెస్ట్ గంప్” అధికారిక రీమేక్. కాగా ఇటీవలే అమీర్ ఖాన్ కిరణ్ రావుతో విడాకుల విషయమై వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు నాగచైతన్య “లవ్ స్టోరీ”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరెక్కుతున్న మరో చిత్రం “థాంక్యూ” కూడా త్వరలోనే విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-