థియేటర్లు తెరుచుకోవడంలో ఇంకా అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నా… స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మాత్రం తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం మొదలు పెట్టేశారు. జూలై నెలలోనే థియేటర్లలో తమ చిత్రం విడుదలవుతుందని ‘తిమ్మరుసు’ నిర్మాతలు చెప్పగా, తాజాగా ఈ నెల 23న ‘నరసింహపురం’ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ఫణిరాజ్, నందకిశోర్, శ్రీరాజ్ తెలిపారు. పలు సీరియల్స్, సినిమాలలో నటించి, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న నందకిశోర్ ‘నరసింహపురం’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సిరి…