రాజ్ తరుణ్ భార్యగా చెబుతున్న లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు పేర్కొన్న ఆమె ప్రైవేట్ గా గడిపిన వీడియోలుతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
Lavanya : నన్ను చంపాలని చూస్తున్నారు!
ఇక అతన్ని అరెస్టు చేసినట్టు వార్తలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టినట్టు తెలుస్తోందది. ఈ క్రమంలో స్పందించిన మస్తాన్ సాయి లావణ్య చెబుతున్నట్టుగా ఆ వీడియోలలో ఉన్నది ఎవరో కాదని అన్నారు. నా భార్య.. నా గర్ల్ ఫ్రెండ్ తో తీసుకున్న వీడియోలు అవి. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 2017లో హనీమూన్ కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి.. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి.. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది అని మస్తాన్ సాయి చెప్పుకొచ్చారు.