లావణ్య ఫిర్యాదు చేసిన క్రమంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇంటికి మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే యువకుడు కూడా వచ్చాడని, వీరిద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మస్తాన్ సాయి నుండి ఒక ల్యాప్ టాప్, రెండు హార్డ్ డిస్క్ లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Karmasthalam : పాన్ ఇండియా ‘కర్మ స్థలం’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ లాంచ్
ఈ క్రమలోనే నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చిన లావణ్య ఎన్ టీవీతో మాట్లాడింది. నేను ఇచ్చిన ఫిర్యాదు పై స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి పిలిపించారని, నాకు ఇంకా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె అన్నారు. మస్తాన్ సాయి, అతని పేరెంట్స్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆమె హార్డ్ డిస్క్ కోసం నన్ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించింది. ఇక నాకు ప్రాణహాని ఉంది, జరిగిన ఘటన పై మొత్తం పోలీసులకు చెప్పాను ఇన్ని రోజులు నాదగ్గర ఎవిడెన్స్ లేకపోవడంతో ఆగిపోయాను కానీ ఇప్పుడు ఎవిడెన్స్ దొరకడంతో పోలీసులకు అన్ని అందజేసానని పేర్కొన్నారు. ఇక ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె వెల్లడించింది.