Dragon : ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.
Also Read : Jatadhara: సుధీర్ బాబుతో సోనాక్షి.. హీరోగారి ఫేట్ మారేనా..?
Also Read
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రధీప్. యూత్ ను ఆకట్టుకునే కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. కాగా డ్రాగన్ విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలిజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ను ముందుగా చేసుకున్న ఒప్పదం ప్రకారం రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాతా అనగా మార్చి 21 న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. ఈ యంగ్ హీరో తర్వాతి సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!