సోషల్ మీడియా రోజు రోజుకు ఎంతగా డెవలప్ అవుతుందో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇరవైనాలుగు గంటలు ఎదో ఓ కారణంగా ఇంటర్‌నెట్ వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ‘ఏఐ’ ఫొటోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతున్నాయె చెప్పకర్లేదు. ఈ ఏఐతో లాభాలు ఉన్నాయా, నష్టాలు కూడా ఉన్నాయా తెలిదు కానీ దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇక ఓ సినిమా తీయాలంటే దాని కోసం చాలా మంది పని చేయాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా అద్భుతమైన కథాకథనాలు ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీతో సాధ్యం అయితే ఎలా ఉంటుంది..? అవును ఇప్పుడు అది సాధ్యం అయింది. తాజాగా తొలి భారతీయ ‘ఏఐ’ సినిమా ‘నైషా’ ను ప్రకటించింది చిత్రబృందం. ఇందులో ఏఐ సృష్టించిన నైషా బోస్, జైన్ కపూర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలై ఎంతగా ఆకట్టుకుందో చెప్పకర్లేదు. ట్రైలర్ గమనిస్తే కనుక ఎక్కడ కూడా ‘ఏఐ’ మూవీ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. నిజంగా మనుషులు నటిస్తున్నట్లు గానే ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం 2025 మే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోందని ఓ పోస్ట్ చేశారు మెకర్స్. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.