MLA Chandrasekhar: కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న – వారి సమాధానం.. తల్లికి వందనం ఎప్పుడు? జవాబు.. మీకు 11 సీట్లు.. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి రైతుకు రూ.20 వేలు ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, రేపు ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ యువత పోరు కార్యక్రమనికి అందరూ ఏకం కావాలని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.. యువత పోరు పోస్టర్ ను యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు.. ప్రకాశం జిల్లా ఒంగోలులో 12వ తేదీన తలపెట్టే యువత పోరు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు.. కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారం చేపట్టి ఇప్పటికే సుమారుగా 10 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేక ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అలానే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు చెల్లించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 12వ తేదీన “యువత పోరు” కార్యక్రమం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 12వ తేదీన భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఈరోజు “యువత పోరు” పోస్టర్ విడుదల చేయడం జరిగిందని అన్నారు.. యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు.
కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న- వారి సమాధానం
1. తల్లికి వందనం ఎప్పుడు?
జ.మీకు 11 సీట్లు.
2. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు?
జ.మీకు 11 సీట్లు.
3. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు?
జ.మీకు 11 సీట్లు.
4. ప్రతి రైతుకు రూ.20 వేలు ఎప్పుడు
జ. మీకు 11 సీట్లు.@ncbn— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) March 10, 2025