మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భార్య అంచనాలు ఉన్నాయి. ఎప్పటినుంచో వీరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అందరికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆసక్తిని ఇంకా ఇంకా పెంచుతూ వెళుతున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో పూర్తయింది. ప్రస్తుతానికి ఒడిస్సాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సెట్లో షూటింగ్ జరిపారు. కానీ తాజా షెడ్యూల్ మాత్రం ఒరిస్సా జిల్లాలోని కోరాపుట్ జిల్లాలో జరగబోతోంది. ఈస్టర్న్ ఘాట్స్ లో ఈ షూటింగ్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..
ఇక ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు హైదరాబాదు నుంచి ఒడిస్సా బయలుదేరి వెళ్ళాడు. మహేష్ బాబుని ఎయిర్ పోర్ట్ లో దింపడానికి మహేష్ బాబు భార్య నమ్రత వచ్చి సెండాఫ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వైజాగ్, కెన్యా, శ్రీలంక సహా మరికొన్ని ప్రదేశాలలో జరపాలని రాజమౌళి అండ్ టీం ప్రయత్నిస్తోంది. ఇండియానా జోన్స్ సిరీస్ ను పోలి ఉండేలా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా అని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ నుంచి ఒక ఫోటో కూడా లీక్ కాకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే..