తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్ విశేషంగా అలరించింది.
Also Read: Nani: దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..
దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు స్టూడియో గ్రీన్ అధినేత కే.ఈ జ్ఞానవేల్ రాజా. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా కంగువ తమిళ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఓపెనింగ్ షార్ట్ లో కథను వివరిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ అద్భుతమైన లొకేషన్స్ నుచుపిస్తూ కథలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ లుక్స్, నటన సూపర్ అనే చెప్పాలి, ఇక కంగువ క్యారక్టర్ లో సూర్య ఆదరగొట్టాడు. ప్రతీ సీన్, ప్రతీ షాట్ క్వాలిటీ లో ఎక్కడ కంప్రమైస్ కాకుండా తెరకెక్కించాడు దర్శకుడు శివ, ఇక చివరలో ముసలితో నీటిలో సూర్య వచ్చే షాట్ ట్రైలర్ కె హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళింది. చివరలో సూర్య తమ్ముడు కార్తీ గుర్రం మీద వస్తున్నటు చూపించాడు. మరి ఆ క్యారక్టర్ కార్తీనా లేక వేరెవరైనా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.