నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలవనుంది.
Also Read :Vikram : బెజవాడలో సందడి చేసిన హీరో, హీరోయిన్..
దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు నిర్మాతగా సుధాకర్ చెరుకూరి. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. నాని ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని అందులో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా భారీ, భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నిజమైన నాయకుడికి ఐడెంటిటీ అవసరం లేదన్న స్లోగన్ ను ఈ సినిమా పోస్టర్ ను డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ వుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు. ప్రియాంకా మోహన్, SJసూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సరికొత్త కథనంతో రానుంది. ఈ సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.