రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయింద. కల్కి కలెక్టన్స్ లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ కనిపించినా వీకెండ్స్, హాలిడేలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్, రూ. 500 కోట్లకు పైగా షేర్ రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలో రూ. 500 కోట్లకు పైగా షేర్ మార్క్ రెండు సార్లు అందుకున్న ఓకే ఒక్క యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. గతంలో బాహుబలికి-2 తో ఆ ఫీట్ ను అందుకున్నాడు ప్రభాస్. అదే విధంగా ఒక్క నైజాంలో రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాలు 3 కలిగిన ఏకైక టాలీవుడ్ హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి -2, సలార్, ఇప్పుడు కల్కితో ‘నైజాంనవాబ్’ గా అవతరించాడు రెబల్ స్టార్. ఈ చిత్రం రిలీజ్ కు ముందు రూ. 372 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రాబట్టి అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల వరద పారించింది. నిర్మాత అశ్వనీదత్ కు రూ. 100కోట్లకు పైగా లాభాలు తెచ్చింది కల్కి. ఇటీవల విడుదలైన భారతీయుడు -2 ఫ్లాప్ అవడం, పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ లేకపోవడం కల్కి చిత్రానికి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. ఓవర్ సీస్ లో 20మిలియన్ల సాధించే ఛాన్స్ ఉంది, అలాగే బాలీవుడ్ లో సాలిడ్ రన్ ఉండే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో కల్కి ఎన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుందో చూడాలి.
Also Read : Viduthalai -2 : విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!