జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జపాన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ఎత్తున జపాన్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అయితే జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కి పోవడం ఖాయం. ఎందుకంటే ఆయనకు అభిమానులు జెండర్ తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కోసం ఎగబడుతున్నారు. ఆటోగ్రాఫ్ లు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వమని కోరుతున్నారు.
Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. నిజమెంత..?
దేవర మొదటి భాగం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. కలెక్షన్స్ విషయంలో కొన్ని ఏరియాలలో ఇబ్బంది అని ప్రచారం జరుగుతున్నా సరే నిర్మాతలు మాత్రం తాము సూపర్ హ్యాపీ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి కొరటాల శివ సెకండ్ పార్ట్ కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈలోపు జపాన్లో రిలీజ్ అవుతూ ఉండడంతో టీం అక్కడికి వెళ్లి ప్రమోట్ చేస్తోంది. అయితే అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి గతంలో ఇదే జపాన్ లో రజనీకాంత్ కి ఈ స్థాయిలో క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజ్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నట్లయింది. ఎందుకంటే జపాన్ లాంటి ప్రొడక్టివ్ దేశంలో కూడా ఇలా అభిమాన హీరో వస్తున్నాడు అంటే పనులు అన్నీ ఆపుకుని ఆయన కోసం వచ్చారు అంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.