ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగింది ఈ మ్యాచ్. చెన్నై బ్యాటింగ్ లో చివరలో జడేజా (32), ధోని (16) అద్భుతంగా ఆడినప్పటికీ.. మ్యాచ్ చేజారిపోయింది. దీంతో.. రాజస్థాన్ ఈ సీజన్ లో మొదటి విజయం సాధించింది. సీఎస్కే బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ త్రిపాఠి (23), శివం దూబే (18), విజయ్ శంకర్ (9), జేమీ ఓవర్టన్ (11) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హసరంగా కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, ఆర్చర్ తలో వికెట్ సంపాదించారు.
UP: విషాదం.. అలహాబాద్ ఐఐఐటీ హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో నితీశ్ రాణా (81) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో రెచ్చిపోయిన రాణా హాఫ్ సెంచరీ చేసి జట్టును భారీ స్కోరు వద్ద నిలబెట్టాడు. అతనికి రియాన్ పరాగ్ (37) మంచి సహకారం అందించాడు. అయితే, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగా అవుట్ కాగా, కెప్టెన్ సంజూ శాంసన్ (20) కూడా వెనుతిరిగాడు. ఇక ఓవర్లలో శిమ్రాన్ హెట్మైర్ (19) కాస్త పర్వాలేదనిపించాడు. ఇక చెన్నై బౌలర్ల విషయానికి వస్తే.. నూర్ అహ్మద్ (2/28), మతీషా పథిరానా (2/28) లు కాస్త కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఖలీల్ అహ్మద్ రెండు కూడా కీలకమైన వికెట్లు తీశాడు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు.
Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య హవా.. భారీగా రెమ్యునరేషన్..