Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరీర్ ను మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. అక్కడి నుంచే బన్నీ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్ లో చెబుతూనే ఉంటాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య-2 వచ్చింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్యబాబు నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ క్లాసికల్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : UP: ఘోరం.. రూ.800 ఫీజు కోసం పరీక్ష రాయనివ్వని యాజమాన్యం.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉంది. ఆయన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీకి సంబంధించిన రెండు సినిమాలు రీరిలీజ్ చేశారు. ఆ నడుమ రీ రిలీజ్ లకు కొత్త డిమాండ్ తగ్గింది. కానీ ఫ్యాన్స్ కు కొన్ని సినిమాలు ఫేవరెట్ ఉంటాయి. ఆర్య-2 మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. కాబట్టి ఈ సినిమాను కూడా ఆదరించే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారంట.