Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు తన తర్వాత సినిమాను ప్రకటించారు. తెలుగు హీరోలతో కాకుండా మొదటిసారి తమిళ హీరోతో మూవీ చేయబోతున్నారు. అందరూ ఊహించినట్టుగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు ఉగాది పండుగ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్, చార్మీ దిగిన ఫొటోలను పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ కావడంతో పూరీ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. ఆయన మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరారు. అయితే తెలుగు సినిమాలకు కథలు చెబుతున్న వారు డేట్లు ఇవ్వట్లేదనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది.
Read Also : Peddi : చరణ్ ఫ్యాన్స్ దాహం తీర్చే న్యూస్ చెప్పిన బుచ్చిబాబు
చివరకు విజయ్ సేతుపతితో సినిమా ఓకే అయింది. ఈ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్టు తెలిపారు. పూరీ ఇప్పటి వరకు తీసిన కథలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉండబోతోందంట. కొత్త జానర్ లో తీస్తున్నట్టు సమాచారం. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట. ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఆలస్యంగా అయినా సరే మంచి సినిమాతో రావాలని పూరీ ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాను కూడా పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద పూరీ జగన్నాథ్, చార్మీ నిర్మించబోతున్నారు.