Show Time : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తుండగా.. మదన్ దక్షిణా మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టు ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Read Also : Keerthi Suresh : బ్లాక్ చీరలో కీర్తి సురేష్ ఘాటు సొగసులు..
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కోణంలో కనిపిస్తోంది. చూస్తుంటే ఏదో క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగా అనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘షో టైమ్’లో గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు మేకర్స్.