Balakrishna : నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కు చేయని విధంగా ఫస్ట్ టైమ్ ఆదిత్య 369కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ఆ మూవీ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తనకు ఎల్లప్పటికీ గుర్తుండి పోతుందన్నారు.
Read Also : RR vs CSK: రాజస్థాన్ ను ఆదుకున్న నితీష్ రాణా.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
‘నేను పాత్రల పరంగా వేరియేషన్స్ కోసం చూస్తున్న టైమ్ లో కృష్ణ ప్రసాద్, సింగీతం శ్రీనివాసరావు నా దగ్గరకు వచ్చి కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. పౌరాణిక పాత్రల్లో నాన్న గారి లాగా నటించాలని అనుకున్నా. ఇందులో శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర కోసం ఒప్పుకున్నా. ఆ పాత్ర నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాలా పాత్రల్లో కనిపించాను. అన్నీ అనుకున్నట్టు కుదిరాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావుకు, శివలెంక కృష్ణ ప్రసాద్ కు రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా జన్మంతా రుణపడి ఉంటాను. ఈ సినిమాను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు రిలీజ్ చేస్తున్నాం. ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.