చాలా మంది నటులు సినిమాలు మాత్రమే కాకుండా .. వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల నుంచి లగ్జరీ ప్రోడక్టుల వరకు ప్రముఖ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ పోస్ట్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం కొన్ని కంపెనీలకు చెందిన ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు. ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తారు. అందులో కండోమ్ యాడ్ ఒకటి. దాదాపు ఈ యాడ్ చేయడానికి నటీనటులు వెనకడుగు వేస్తుంటారు. కానీ ఈ యాడ్‌కు జాన్వీ కపూర్ బాగా సూట్ అవుతుందని ఓ వ్యాపారవేత్త కామెంట్ చేశారు..
Also Read: Thandel: ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్
జాన్వీ గ్లామర్ గురించి అసభ్యంగా ప్రస్తావిస్తూ ఓ కండోమ్ సంస్థ అధినేత వివాదంలో చిక్కుకున్నారు. మాన్ ఫోర్స్ సంస్థ ఫౌండర్ రాజీవ్ జునేజా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ గురించి కామెంట్స్ చేశారు. తమ బ్రాండ్ కండోమ్ యాడ్‌కి జాన్వీ కపూర్, రణబీర్ కపూర్ బెస్ట్ ఛాయిస్ అని తెలిపారు. వీరిద్దరూ కలిసి కండోమ్ యాడ్ చేస్తే తిరుగు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. రాజీవ్.. జాన్వీ కపూర్ అనుమతి లేకుండా ఆమె పేరు ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో ఆయనపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఒక మహిళ.. కండోమ్ ప్రచారానికి బెస్ట్ అని బహిరంగంగా ఎలా చెబుతారని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? జాన్వీ కపూర్‌కి శృంగారపరమైన ఇమేజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారా? అంటూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.