బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్న విషయం తెలిసిందే. ‘గదర్ 2’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ మూవీ చేశారు. ఈ మూవీ విడుదలైన రెండు మూడు రోజులు డల్‌గా ప్రారంభమైంది. కానీ తర్వాత టాక్ ప్రకారం మాస్ ఆడియెన్స్‌కి ఫుల్ మీల్స్ అందించింది. గోపీచంద్ తన మార్క్ భారీ యాక్షన్ సీన్లతో సినిమాని డిజైన్ చేసి సన్నీ డియోల్‌ని మరో బాలకృష్ణలా చూపించారు. ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన జాట్‌కి మేకర్స్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ పార్ట్ 1 థియేటర్స్‌లో రన్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యిపోయింది. అయితే..
Also Read : Sharukhan : ‘కింగ్’ మూవీలో మరో హీరో..
ఈ మూవీ కోసం ఎంత గానో వేట్ చేస్తున్న ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ లాక్ అయినట్టు బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాట్ చిత్రం ఈ జూన్ 5 నుంచి ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందట. అది కూడా కేవలం హిందీ భాషలోనే అందుబాటులో రానున్నట్టు టాక్. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది