Dulquer Salman and Vijay Deverakonda in Kalki 2898 AD : ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్దిగా ముందు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో ప్రభాస్ తో కలిసి ఆడియన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ నటిస్తున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
Kalki 2898 AD: చివరి నిముషంలో మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
అయితే వీరిద్దరూ ఏ పాత్రలలో నటిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే నాగశ్విన్ వీరిద్దరూ సినిమాలో భాగమవుతున్నానని ప్రకటించిన వెంటనే వారికి ప్రభాస్ థాంక్స్ చెబుతూ కనిపించాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగశ్విన్ వీడియో ఆన్ చేసి మాట్లాడుతుండగా ప్రభాస్ మాత్రం కేవలం వాయిస్ మాత్రమే వినపడేలా ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండ కల్కిగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే ఈ విషయం మీద సినిమా రిలీజ్ అయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.