AP Govt gave Permission for one more show in AP for Kalki 2898 AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న క్రమంలో సినిమా టీంకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తూ ఒక జీవో జారీ చేయగా ఇప్పుడు అదనంగా ఆరవ షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ ఈమేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఏపీలో కల్కి టికెట్ ధరలు కూడా ప్రభుత్వ అనుమని మేరకు పెరిగిన సంగతి తెలిసిందే.
AP Crime: తక్కువ పెట్టుబడితో ఎక్కుల లాభం..! నిండా ముంచిన మనీ సర్కులేషన్ స్కీం యాప్..
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 75 రూపాయాలు.. మల్టీప్లెక్స్ లో టికెట్ పై 125 రూపాయాలు పెంచేందుకు కల్కి టీం కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదలైన రోజు అంటే జూన్ 27 నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక తాజా ఉత్తర్వులతో ప్రతి థియేటర్‌లో రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక రేట్ల పెంపు జీవో ప్రకారం గత ఐదేళ్లలో ఏ సినిమాకి లేనంతగా అదనపు టికెట్ ధర కల్కికి దక్కినట్టు అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయి రచ్చ రేపుతున్న సంగతి తెలిసిందే.