చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దర్శకత్వం వహించే తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా సంపంత్ నంది సినిమా రానుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Also Read : Karthi : కాస్త పబ్లిసిటీ చేయండి ‘బాబు’.. రిలీజ్ అవుతున్నట్టే తెలియదు..
ఇది 1960ల చివరలో భారతీయ సెల్యులాయిడ్‌లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామీణ నేపథ్యంలో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. అనేక సమస్యలకు రక్తం సమాధానంగా మారే భయంతో కూడిన ప్రపంచంలో ఈ చిత్ర కథ మొదలవుతుంది. గ్రిప్పింగ్ యాక్షన్ మరియు ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఎమోషనల్ కథ, కథనంతో రానుంది శర్వా 38. వెండితెరపై ఇంతకు ముందెన్నడూ రానటువంటి కథ, కథనాలతో యూనివర్సల్ అప్పీల్ లో పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. శర్వా మరియు సంపత్ నంది కాంబోలో రానున్న మొదటి సినిమా ఇది. కొంతకాలంగా కథపై కసరత్తు చేస్తున్న దర్శకుడు శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనుండగా, 60ల నాటి పాత్రను పోషించేందుకు శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బీడుబారిన భూమిలో మంటలు చెలరేగుతున్నట్లు చూపించారు. ఈ సినిమాకు సౌందర్ రాజన్ ఎస్ కెమెరామెన్ గా వర్క్ చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.