టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన్న రీతూ వర్మ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read:Sri Lila: బాలీవుడ్‌లో శ్రీలీల రెమ్యునరేషన్ మరి అంత తక్కవ..!
రీతూ మాట్లాడుతూ.. ‘ నేను నటి కావాలని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది నేనిక్కడికి దాకా వచ్చి.. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న అంటే నమ్మలేకపోతున్న. నా సినీ ప్రయాణం పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాల్లో భాగమయ్యా. ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. కానీ నాకు యాక్షన్ ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఉంది. కామెడీ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ‘మజాకా’ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. రైటర్ ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. అది విన్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా. అలాగే ఇందులో బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. నా పాత్రకు ఈ కథలో ఎంతో ప్రాధాన్యముంది. అందుకే స్క్రిప్ట్ వినగానే చేయాలని నిర్ణయించుకున్నాను.ముందు నుంచి పూర్తి స్థాయి పీరియాడిక్ సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నేను తెలుగులో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఓకే చెప్పా. అలాగే ‘శ్రీకారం’ కిశోర్ దర్శకత్వంలో ఓ వెబ్సెరీస్ కూడా చేశా. అది త్వరలో విడుదల కానుంది’ అంటూ తెలిపింది రీతూ. మొత్తానికి ఈ ఏడాది బీజి హీరోయిన్ గా మారిపోయింది.