ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వినోదయ సీతమ్ ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే బ్రో మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయి. పవర్ ఫుల్ స్టైలిష్ గాడ్‌గా కనిపించబోతున్నడు పవన్. జులై 28న రిలీజ్ కానున్న బ్రో మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన మేకర్స్, ఇప్పటికే టీజర్ తో ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇచ్చేసారు. లేటెస్ట్ గా ఈ మూవీ ఉత్తరాంధ్రా థియేటర్ రైట్స్ ని పూర్వి పిక్చర్స్ సొంతం చేసుకున్నారు అనౌన్స్మెంట్ ఇచ్చింది. క్రాక్, ఆదిపురుష్, బిచ్చగాడు 2 లాంటి ఎన్నో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసింది పూర్వి పిక్చర్స్. ఇదిలా ఉంటే బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జులై మూడో వారంలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది.
Happy to announce our next release #BRO in Uttarandhra area.
Need your love & blessings 🙏🏼#BROTheAvatar#BROon28thJuly @PawanKalyan @IamSaiDharamTej @thondankani @peoplemediafcy @MusicThaman pic.twitter.com/EqzXDgmCfO
— Poorvi Pictures (@DistributorTFI) July 11, 2023