Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరును పెంచేసింది. ఇప్పటికే ఒకపక్క సాయి ధరంతేజ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. ఇంకోపక్క మేకర్స్ సోషల్ మీడియాలో నిత్యం బ్రో సినిమాకు సంబంధించిన కొత్త కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
Rakesh Varre: బాహుబలి నటుడు.. మొన్న హీరో.. నేడు నిర్మాత.. మాములుగా లేదుగా
గత కొన్ని రోజులుగా ఈ సినిమా ట్రైలర్ ను జూలై 21 న కానీ, 22 న కానీ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజగా జూలై 22 న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ట్రైలర్ అనౌన్స్ మెంట్ తో పాటు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను కలిఫై ట్రైలర్ పోస్టర్ లోయాడ్ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. డేట్ అయితే ఇచ్చారు కానీ, సమయం మాత్రం చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్.. ఏ టైమ్ కు రిలీజ్ చేస్తారు అనేది మిస్టరీగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. రేపటిలోగా టైమ్ కూడా మేకర్స్ టైమ్ అనౌన్స్ చేస్తారని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మామఅల్లుళ్లు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.