సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించి మెప్పించాడు బాబీ డియోల్. రణబీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో అంతకన్నా ఎక్కువ పేరు కేవలం పది-పదిహేను నిమిషాల క్యారెక్టర్ తో బాబీ డియోల్ సంపాదించాడు. టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్క మాట మాట్లాడకుండా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన బాబీ డియోల్… ఎంట్రీకి పాన్ ఇండియా ఊగిపోయింది. ఇప్పటికీ బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమాల్ కుడు’ నేషన్ వైడ్ ట్రెండింగ్ లోనే ఉంది. విలన్ గా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా కోసం ‘ఉధిరన్’గా మారుతున్నాడు.
Read Also: Nikhil: రిపబ్లిక్ డే రోజున “చైనా పీస్” సినిమా అనౌన్స్మెంట్…
జనవరి 27న బాబీ డియోల్ కొత్త రోల్ ఉధిరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానుంది. ఈ పోస్టర్ కంగువ సినిమాకి సంబంధించింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ శివ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘కంగువ’. కోలీవుడ్ నుంచి వస్తున్న మొదటి వెయ్యి కోట్ల సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీలో బాబీ డియోల్ నెగటివ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. సూర్య vs బాబీ డియోల్ వార్ స్క్రీన్ పైన టెర్రిఫిక్ గా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజైన కంగువ పోస్టర్స్ సినిమాపై అంచనాలని రోజు రోజుకి పెంచుతూనే ఉన్నాయి కాబట్టి బాబీ డియోల్ పోస్టర్ కూడా సాలిడ్ గా ఉంటే నార్త్ లో కంగువ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి రేపు బయటకి రాబోయే పోస్టర్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.
The mighty #Udhiran of Kanguva will be revealed tomorrow at 11 am🔥
Stay Thrilled! #Kanguva 🦅@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @NehaGnanavel @saregamasouth pic.twitter.com/gJuNNQpGrl
— Studio Green (@StudioGreen2) January 26, 2024