కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్… ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌజ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో నిఖిల్ నుంచి వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. “చైనా పీస్” అనే సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో సడన్ గా ఈ పోస్టర్ చూసిన వాళ్లు నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అనుకున్నారు. అయితే “చైనా పీస్” ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ని మాత్రమే నిఖిల్ చేసాడు. నిఖిల్ కి ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి సంబంధం లేదు.
డైరెక్టర్ అక్కి విశ్వనాథ రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిహాల్, సూర్య శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తున్నారు. పోస్టర్ లో ఈ ఇద్దరు పేర్లు కాస్త పైన వేయడంతో ముందుగా టైటిల్ చూసిన వాళ్లు నిఖిల్ సినిమా అనుకోని పొరబడే అవకాశం ఉంది. చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన సూర్య శ్రీనివాస్, నిహాల్ లు హీరోలుగా మారుతూ ఇండో-చైనా కాంఫ్లిక్ట్ కి సంబంధించిన కథని ఎంచుకున్నారు. పోస్టర్ డిజైన్ లో గాల్వాన్ వాలీ పేరు చూస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా మార్కెట్ ని కొలాప్స్ చేసిన థీమ్ తో తెరకెక్కే కథలా ఉంది. కమల్ కామరాజు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీకి సురేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… ఎడిటర్ గా మార్తాండ్ కే వెంకటేష్ చేస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చైనా పీస్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Thrilled to unveil the first look of #ChinaPiece. Wishing the team the best for this Movie.. Be prepared to be enthralled by an unparalleled saga of endurance, the profound bonds of friendship, and unwavering patriotism!@akki_viswanath @NihalKodhaty1 @isuryasrinivas… pic.twitter.com/AYKigSlE6F
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2024