పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే క్షణం రానే వచ్చింది. దీపావళీని ఇంకా వందరెట్లు ఎక్కువగా చేయడానికి ‘భీమ్లా నాయక్’ సిద్దమైపోయాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా దీపావళీ కానుకగా ‘ది సౌండ్ ఆఫ్ భీమ్లా’ వీడియో ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ ఆడియో ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వీడియో ప్రోమో కూడా అదే విధంగా దుమ్ము రేపుతోంది.
ఈ ప్రోమోలో టపాకాయల ముందు కూర్చొని భీమ్లా నాయక్ ‘నాగరాజు గారు.. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి.. హ్యాపీ దీపావళి’ అంటూ రానా కారుని పవన్ నాటు బాంబ్ తో పేల్చేయడం గూస్ బంప్స్ ని తెప్పిస్తోంది. పవన్ మాస్ ఎలివేషన్స్ కి పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రోమోలో చెప్పినట్లుగానే పవన్ అభిమానులకు దీపావళీ ముందుగానే వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పన్ కోషియమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.