Balakrishna Says Sorry To Deva Brahmins For His Mistake: ఇటీవల తాను చేసిన ఒక పొరపాటుకు గాను నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు. తనకు తెలియకుండా చేసిన ఆ తప్పుకు క్షమించాల్సిందిగా కోరుతూ.. దేవబ్రాహ్మణులకు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల తన వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాుతూ.. బ్రాహ్మణులకు దేవళ మహర్షి గురువు అని, వారి నాయకుడు రావణాసురుడు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై దేవాంగుల కమ్యూనిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా బాలయ్య చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
North India – Cold: ఉత్తరాది ‘వణుకు’తోంది… ఎందుకో తెలుసా..?
ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. ఫేస్‌బుక్ మాధ్యమంగా స్పందించారు. దేవబ్రాహ్మణులకు సారీ చెప్పారు. ‘‘దేవబ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మనఃపూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకు అందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగుల్లో నా అభిమానులు చాలామంది ఉన్నారు. నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా? అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తాను రాసిన బహిరంగ లేఖలో బాలయ్య పేర్కొన్నారు.
Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి
కాగా.. సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించగా.. హనీ రోస్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చాడు.
Hyderabad Roads Empty: సంక్రాంతి ఎఫెక్ట్.. బోసిపోయిన భాగ్యనగరం.. రోడ్లన్నీ నిర్మానుష్యం