Anushka Shetty: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు అయితే ఉంటాయో అన్ని రూమర్స్ కూడా ఉంటాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా వాటిని ఆపడం ఎవరివలన కావడం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలు వాటిని పట్టించుకుంటారు.. పట్టించుకోరు. కానీ, కొంతమంది సెలబ్రిటీల విషయంలో ప్రతిసారి రూమర్స్ వినిపిస్తూనే ఉండడం మాత్రం దారుణమని వారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక హీరో, హీరోయిన్ రెండు అంతకుమించి ఎక్కువ సినిమాలలో నటిస్తే వారిద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. అలా రూమర్స్ క్రియేట్ చేసిన జంటల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జంట ప్రభాస్- అనుష్క. వీరిద్దరూ కలిసి దాదాపు మూడు సినిమాలు కన్నా ఎక్కువే చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం తాము కేవలం స్నేహితులమే అని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పారు అయినా కూడా అభిమానులు ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు రాస్తూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు అనుష్క.. స్టార్ క్రికెటర్ ను పెళ్ళాడుతున్నట్లు వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా కూడా అనుష్క పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో ఆమె ఫాన్స్ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్వీటీ తన పెళ్లి గురించి చెప్పే వరకు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయమై చర్చ మొదలైంది. ఒక స్టార్ క్రికెటర్ తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఎవరు బయటపెట్టలేదు. వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పాయని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని, అనుష్క కొన్నిరోజుల్లో అభిమానులకు అధికారికంగా చెప్పనుందని చెప్పుకొచ్చారు. మరి మొన్నటి వరకు ప్రభాస్ తో పెళ్లి అని ఇప్పుడేమో ఇతనితో అనడం పద్ధతి కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లు పుట్టించడం దారుణమని స్వీటీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై స్వీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.