Anushka Shetty Opens Up on Marriage: వయసు పెరిగే కొద్దీ.. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం మహిళలకు పరిపాటి. కానీ కొంతమంది సెలబ్రిటీలు వివాహ వయస్సు దాటినా.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పెళ్లి గురించి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ జాబితాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ ‘అనుష్క శెట్టి’ అగ్రస్థానంలో ఉంటారు. అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహం గురించి మాట్లాడారు. స్వీటీ చెప్పిన ముచ్చట్లు…
Anushka Shetty: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు అయితే ఉంటాయో అన్ని రూమర్స్ కూడా ఉంటాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా వాటిని ఆపడం ఎవరివలన కావడం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలు వాటిని పట్టించుకుంటారు.. పట్టించుకోరు. కానీ, కొంతమంది సెలబ్రిటీల విషయంలో ప్రతిసారి రూమర్స్ వినిపిస్తూనే ఉండడం మాత్రం దారుణమని వారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.