Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పడూ మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. అదేంటి అంటే.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్టార్ హీరోలు అయిన ప్రభాస్, మహేష్ మాత్రమే ఆ గౌరవాన్ని అందుకున్నారు . తాజాగా వారి లిస్ట్ లోకి బన్నీ కూడా చేరినట్లు తెలుస్తోంది.
Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!
ఇక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహనికి కొలతలు ఇవ్వడానికి త్వరలోనే లండన్ కు వెళ్లనున్నాడని సమాచారం అందుతుంది. అక్కడే రెండు రోజులు ఉండి.. ఆ ప్రక్రియ పూర్తిచేయనున్నాడని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఈ విగ్రహావిష్కరణ ఉండనుందని తెలుస్తోంది. ఈ విషయం తెల్సిన అభిమానులు బన్నీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. పుష్ప తో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెడితే.. గ్లోబల్ స్టార్ గా మారడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.