Devil first single Maaye Chesey released: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇక ఈమధ్యన రిలీజైన ఈ మూవీ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ‘డెవిల్’ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డెవిల్ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ అనే పాటను మొదటి సాంగ్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మాయే చేశావే..’ పాటను గమనిస్తే ఇదొక అద్బుతమైన మెలోడీ సాంగ్ లా ఉంది. పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు అందమైన ఫీల్ కి లోనవుతారు. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించగా సన్నివేశాలు, పాటలను కూడా అలాగే షూట్ చేశారు.
Meera Postmortem: విజయ్ ఆంటోనీ కుమార్తె పోస్టు మార్టం పూర్తి.. రిపోర్టులో ఏముందంటే?
కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్న మేకర్స్ పాటలు, డైలాగ్స్ విషయంలో కూడా అదే కేర్ తీసుకున్నారు. ఇక ఈ సాంగ్ ను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం ఇంకా హైలైట్‌గా నిలవగా కచ్చితంగా ఆడియెన్స్ ప్లే లిస్ట్ లో రిపీటెడ్ సాంగ్ అవుతుందని అంటున్నారు. ఈ పాటకు బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా హర్షవర్ధన్ రామేశ్వర్ సూపర్బ్ రెట్రో ట్రాక్‌ను అందించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కలిపి మాయే చేశావే.. సాంగ్‌తో మేకర్స్ ఓ ఎగ్జయిటింగ్ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించింది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ వేసిన ఎక్స్‌ట్రార్డినరీ సెట్స్ విజువల్ రిచ్‌నెస్‌ను తీసుకు రాగా సౌందర్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.