Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం అక్కినేని వారసుడు ఒక సక్సెస్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. గతేడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కు మరోసారి చుక్కెదురయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్.. ఇలాంటి ఒక డిజాస్టర్ ను ఇస్తాడని అభిమానులు అనుకోలేదు. ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటీ లోకి కూడా రాలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఏజెంట్ రిలీజ్ తరువాత అఖిల్.. మీడియాకు దూరం గా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. మొన్నామధ్య రామ్ చరణ్ పార్టీలో మెరిశాడు. మళ్లీ ఇప్పటివరకు పత్తా లేడు. ఇక తాజాగా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెరిశాడు. ఈ పార్టీకి గెస్ట్ గా అఖిల్ హాజరు అయ్యాడు.
Nandamuri Balakrishna: హనుమాన్ ను వీక్షించిన బాలయ్య.. ఏమన్నాడంటే.. ?
సడెన్ గా అఖిల్.. సలార్ సక్సెస్ పార్టీకి రావడమేంటి.. ఆ పార్టీకి, అఖిల్ కు సంబంధం ఏంటి.. ? అనేది అందరికి వస్తున్న అనుమానం. అయితే అప్పుడెప్పుడో అఖిల్.. కెజిఎఫ్ మేకర్స్.. అదే ఇప్పుడు సలార్ మేకర్స్ తో ఒక సినిమా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. పక్కా పకడ్బందీగా ఈ సినిమాను అఖిల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అందుకే అఖిల్ ను కూడా ఈ పార్టీకి పిలవడం జరిగినట్లు సమాచారం. ఇక ఈ పార్టీ మొత్తంలో అయ్యగారే హైలైట్ గా నిలిచాడు. ఫుల్ గడ్డం, తలకు క్యాప్.. బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయాడు. అయితే చేతికి కట్టుతో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ చేతికి గాయం ఎలా అయ్యింది. షూట్ లో అయ్యిందా.. ? లేక వేరేవిధంగా గాయం అయ్యిందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.