Nandamuri Balakrishna: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ హిట్ తో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ రూ. 100 కోట్లను రాబట్టింది. థియేటర్ల విషయంలో వివాదాలను అందుకున్నా కూడా పట్టు వదలకుండా సినిమాను రిలీజ్ చేసి హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక సినిమా హిట్ పై నెటిజన్స్ మాత్రమే కాదు ప్రముఖులు కూడా ఎన్నో ప్రశంసలు అందిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ వీక్షించాడు. చిత్రబృందం ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా.. బాలయ్యకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమాచూసి బాలయ్య చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మతో పాటు చిత్ర బృందాన్ని మొత్తం ప్రశంసించినట్లు సంచార.
ప్రశాంత్ వర్మ వర్క్ గురించి బాలయ్యకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ షోకు ప్రోమోలు చేసింది ప్రశాంత్ వర్మనే. అప్పుడే ప్రశాంత్ వర్మపై బాలయ్య ప్రశంసలు కురిపించాడు. ఇక వీరిద్దరి కాంబోలో ఒక సినిమా కూడా రానుంది అని టాక్. ఇప్పటికే ప్రశాంత్ వర్మ.. బాలయ్యకు ఒక కథ చెప్పడం జరిగింది. అది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుంది అని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా బాలయ్య ఓకే చెప్పలేదని.. చెప్పిన వెంటనే సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలో అది నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.