చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..అవును.. నిజమే.. ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత డైరెక్ట్‌గా సైజ్ జీరో జీన్స్‌లోకి వెళ్ళిన సెలిబ్రిటీల గురించి ఆలోచిస్తూ అలా మీరు మారిపోవాలని చూడొద్దు. దీని వల్ల లేని సమస్యలను మీరు తెచ్చుకున్నవారవుతారు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఆరోగ్యంగా ఉంటూ, పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉండడం. ఎందుకంటే ఈ టైమ్ మీకు మళ్ళీ రాదు. దీన్ని మీరు మళ్ళీ ఎంజాయ్ చేయలేరు. బరువు కొన్ని రోజుల తరవాతైనా తగ్గొచ్చు. కాబటి ఈ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.తినడానికే కూడా టైమ్ లేనంత బిజీ గా మీరుంటే వర్కౌట్ ఎలా చేస్తారు? వర్కౌట్ అంటే కనీసం కొంత సమయం దానికి కేటాయించాలి కదా. మీరు చెప్పింది నిజమే. కానీ, ప్రస్తుతం మీకు అంత టైమ్ ఉండదు. కానీ, దొరికిన టైమ్‌లో ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నా… దొరికిన పది నిమిషాలు అయినా వాడుకోండి. మరోసారి ఇంకో పది నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేయండి. ఈ పది నిమిషాలే నెమ్మదిగా ఇరవై, ముప్ఫై నిమిషాలౌతాయి.
Read Also : మెడ, వెన్ను నొప్పి వస్తోందా? ఈ టిప్స్ పాటించండి