తిరొక్కతీరు బాధలతో సతమతమౌతున్న మగజాతిని వేధించడానికి అన్నట్లు మరో వ్యాధి సిద్ధమైంది. ఆ వ్యాధి పేరే వెక్సాస్ సిండ్రోమ్. అసలు ఏంటి ఈ వ్యాధి. దీని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్ధాం.. 2020లో తొలిసారిగా వెక్సాస్ అనే వ్యాధి వైద్యులు గుర్తించారు. ఇది ఒక అరుదైన, వంశపారంపర్యంగా రాని ఆటోఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి మధ్యవయసులో ఎలాంటి కారణం లేకుండానే తరచూ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపు) ప్రేరేపిస్తుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఒకసారి వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం!
READ MORE: Khammam: ఏం కష్టం వచ్చిందో.. ఏమో..? ఉరేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది..
కణంలో జీవ పదార్థంలోని చోట (Vacuoles), X- క్రోమోజోమ్, ఈ1 ఎంజైమ్, స్వీయ వాపు ప్రక్రియ గుణాలు, శారీరక మార్పులు ఇందులో పాలు పంచుకుంటాయని నిపుణులు వివరించారు. అందుకే వీటన్నింటినీ ధ్వనించేలా ఈ వ్యాధికి వెక్సాస్ అనే పేరును శాస్త్రవేత్తలు నిర్ణయించారు. medlineplus అధ్యయనంలో రక్తకణాల్లోని UBA1 జన్యువులో తలెత్తే మార్పులు వెక్సాస్‌కు కారణమవుతున్నట్టు గుర్తించారు. ఈ జన్యువు X-క్రోమోజోమ్‌లో ఉంటుందని, ఇది పురుషుల్లో ఒక X-క్రోమోజోమ్ ఉంటే మహిళల్లో రెండుంటాయంటున్నారు. పురుషుల్లో ఒక జన్యు ప్రతిలో లోపం తలెత్తినా వెక్సాస్ రావొచ్చని, అదే మహిళల్లో రెండు ప్రతుల్లోనూ మార్పులు తలెత్తాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల VEXAS సిండ్రోమ్ సాధారణంగా వృద్ధులను, ప్రధానంగా పురుషులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
వారసత్వంగా రావు..
V – VEXAS ఉన్న రోగుల ఎముక మజ్జ మూల కణాలలో వాక్యూల్స్ తరచుగా గుర్తించబడతాయి. E – UBA1 జన్యువు ద్వారా ఎన్కోడ్ చేయబడిన E1 యుబిక్విటిన్ కంజుగేటింగ్ ఎంజైమ్ రోగులలో పరివర్తన చెందుతుంది. X – పరివర్తన చెందిన UBA1 జన్యువు తిరోగమనం చెంది X- క్రోమోజోమ్పై ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధి దాదాపు ఒకే X క్రోమోజోమ్ ఉన్న వ్యక్తులలో కనిపిస్తుంది. A – రోగులకు ఆటోఇన్ఫ్లమేషన్ ఉంటుంది. S – VEXASకు కారణమయ్యే ఉత్పరివర్తనలు సోమాటిక్. అవి జీవితంలో ఏదో ఒక సమయంలో సంక్రమిస్తాయి, వారసత్వంగా రావని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి సంక్రమించవని, పుట్టిన తర్వాతే UBA1 జన్యువు మారుతుందంటున్నారు. కొత్త కణాలు పుట్టుకొచ్చేటప్పుడు డీఎన్‌ఏ ప్రతులు ఏర్పడుతున్న సమయంలో జన్యువులో మార్పులు తలెత్తుతాయని వివరించారు. వీటిల్లో చాలా వరకు హాని చేసేవేమీ కావని, కానీ UBA1 జన్యువులో తలెత్తే మార్పులు వెక్సాస్ జబ్బుకు దారితీస్తాయని వెల్లడిస్తున్నారు.
READ MORE: Janaki V vs State of Kerala: : ఓటీటీలోకి వివాదస్పద సినిమా.. ఎప్పుడంటే?
జబ్బును గుర్తించేదెలా? : clevelandclinic అధ్యయనంలో USలో ప్రతి 13,000 మందిలో ఒకరిని ఇది ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. VEXAS సిండ్రోమ్ చాలా అరుదని, 50 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి 8 వేల మందిలో ఒకరిలో, అదే 50 ఏళ్లు పైబడ్డ మగవారిలో ప్రతి 4 వేల మందిలో ఒకరిలో ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. జన్యు పరీక్ష ద్వారా UBA1 మార్పులను గుర్తించటం మంచిదని సూచిస్తున్నారు.
ఇవే లక్షణాలు: ఈ వ్యాధి చాలా వరకూ ఎముక మజ్జ, రక్తం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు వెల్లడించారు. దీని ద్వారా చర్మం, ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలూ ప్రభావితం కావొచ్చని, వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవని పేర్కొన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలు కనిపిస్తుంటాయని వెల్లడించారు. ముక్కు ఎరుపెక్కటం, చర్మం మీద బాధాకరంగా ఉండే దద్దుర్లు, నొప్పి, వాపు, చెవులు, ఊపిరితిత్తులు ప్రభావితం కావటం వల్ల దగ్గు, రక్తం గడ్డలు ఏర్పడటం, అయాసం, రక్తనాళాలు ఉబ్బటం, జ్వరాలు, తీవ్రమైన నిస్సత్తువ, ఎర్ర రక్తకణాలు లేదా రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్లెట్లు, ఎముక మజ్జ బయాప్సీలో అసాధారణ మార్పులు వస్తాయన్నారు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.