Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,…
తిరొక్కతీరు బాధలతో సతమతమౌతున్న మగజాతిని వేధించడానికి అన్నట్లు మరో వ్యాధి సిద్ధమైంది. ఆ వ్యాధి పేరే వెక్సాస్ సిండ్రోమ్. అసలు ఏంటి ఈ వ్యాధి. దీని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్ధాం.. 2020లో తొలిసారిగా వెక్సాస్ అనే వ్యాధి వైద్యులు గుర్తించారు. ఇది ఒక అరుదైన, వంశపారంపర్యంగా రాని ఆటోఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి మధ్యవయసులో ఎలాంటి కారణం లేకుండానే తరచూ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపు) ప్రేరేపిస్తుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఒకసారి వ్యాధి లక్షణాలు,…
Hemoglobin Levels: హిమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాల (ఎరిథ్రోసైట్స్)లోని ప్రధాన భాగం అయిన ప్రోటీన్. హిమోగ్లోబిన్ ఐరన్ కలిగి ఉంటుంది. ఇది ఆక్సిజన్ బంధించడానికి అనుమతిస్తుంది. హిమోగ్లోబిన్ మీ ఎర్ర రక్త కణాలను ఊపిరితిత్తుల నుండి మీ శరీరంలోని ఇతర కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేలా చేస్తుంది. మొత్తంగా ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి పనిచేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు, దానిని ‘రక్తహీనత’ అంటారు. అనేక రకాల రక్తహీనత కూడా ఉన్నాయి. ఇవి…
భారత్‌లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ రోజున ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటారు.