4 Home Remedies For Black Hair: ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రతిఒక్కరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కాలుష్యం, నిత్యం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, జన్యు లోపాలు, విటమిన్స్ లోపం.. ఇలా వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మితిమీరిన కెమికల్స్ వాడటం వల్ల మీ జుట్టు త్వరగా పాడవుతుంది. ఇక అలెర్జీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ సమస్య నుంచి విముక్తి పొందగల కొన్ని దేశీయ పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గోరింట:
హెన్నా పౌడర్ సహాయంతో జుట్టు నల్లబడుతుంది. దీన్ని తయారుచేయడానికి గోరింట పొడి, కాఫీ పొడి, నిమ్మరసం మరియు వేడి నీటిని తీసుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటసేపు ఉంచాలి. ఆపై కడిగేసుకోవాలి.
ఉసిరి పొడి:
ఉసిరి పొడితో జుట్టు తెల్లబడకుండా నిరోధించవచ్చు. ముందుగా ఒక చెంచా ఉసిరి పొడిని తీసుకుని.. అందులో 3 చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. కొబ్బరి నూనె నల్లగా మారే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేస్తూనే ఉండాలి. ఆ మిశ్రమాన్ని చల్లార్చి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.
Also Read: Ashes Test 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!
బ్లాక్ వాల్‌నట్:
బ్లాక్ వాల్‌నట్‌ను జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడానికి.. వాల్‌నట్ తొక్కను పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను 2 గంటల తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు బలంగా, నల్లగా మారుతుంది. ముందుగా ఒక గిన్నెలో నూనెను తీసుకుని.. తలకు మసాజ్ చేయండి. తరచుగా ఇలా చేయడం వల్ల మీ జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.
Also Read: Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!