Bubble Gums: బబుల్ గమ్స్ ని చిన్న పిల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. మరి ఈ బబుల్ గమ్స్ ఆరోగ్యానికి హానికరమా..? లేక ఉపయోగమా..? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొందరు బబుల్ గమ్స్ తినడం మంచిది కాదు అంటారు. మరి కొందరు మంచిదే అంటారు. మరి బబుల్ గుమ్స్ తినడం మంచిదా కాదా అంటే.. రెండూను. బబుల్ గమ్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అలానే నష్టాలు ఉన్నాయి. మరి బబుల్ గమ్స్ వల్ల ఉపయోగాలు ఏంటో నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉపయోగాలు: బబుల్ గమ్స్ తినడంవల్ల నోటి దుర్వాసన తగ్గుంది. పళ్ళు శుభ్రంగంగా ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. బరువుని తగ్గిస్తుంది. లాభాలు ఉన్నాయి కదా అని మోతాదుని మించి తింటే అనర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి బబుల్ గమ్స్ ని అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Read also:The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..
నష్టాలు: బబుల్ గమ్స్ ని ఎక్కువగ తినే వాళ్ళు పౌష్ఠిక ఆహారాన్ని అంటే తాజా కూరగాయల్ని, పండ్లని తినడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎక్కువగా మింట్ ఫ్లేవర్ ఉండే చాక్లెట్లు మరియు చిప్స్ తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే మనము ఆహరం తిన్నప్పుడు మన శరీరం మెదడుకి ఆహారం తింటున్నారు జీర్ణం చేసేందుకు ఎంజైమ్స్ విడుదల చెయ్యమని సంకేతాలని పంపిస్తుంది కానీ నోట్లో ఎప్ప్పుడు బబుల్ గమ్ ఉండడం వల్ల మనం ఏదో తినబోతున్నాం అని పొరపాటు సంకేతాలను పంపి ఎంజైమ్స్ విడుదల అయ్యేలా చేస్తుంది. దీనివల్ల నిజంగా తింటున్నప్పుడు ఎంజైమ్స్ విడుదల కావు. దీని కారణంగా జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయి.నిరంతరం బబుల్ గమ్స్ నమలడం వల్ల దవడ ఎనుక పైన ఒత్తిడి పడి చెవి నొప్పి వస్తుంది. చిన్నపిల్లల్లో మైగ్రేన్ సమస్యలు తలెత్తుతాయి. అధికంగా బబుల్ గమ్స్ తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. షుగర్ లెస్ బబుల్ గమ్స్ అసలు తినకూడదు. షుగర్ లెస్ బబుల్ గుమ్స్ లో రసాయనాలను వాడతారు. దీనివల్ల దంత సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.