భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.