ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి.